తెలంగాణలో ఎవరికీ కరోనా రాలేదు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ముందస్తు చర్యలతోనే కరోనా ప్రబలకుండా నియంత్రించామన్నారు.  కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సహా వివిధ వైద్య సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..


కరోనా విషయంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. తెలంగాణలో ఎవరికీ కరోనా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఉన్నాయి. కరోనా వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించాలి. అధిక ఉష్ణోగ్రతల ప్రదేశంలో కరోనా బతకదని నిపుణులు చెబుతున్నారు.  లండన్‌ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ ఉందని తేలిందని తెలిపారు